హైదరాబాద్: 28°C
తెలంగాణ

హెచ్ఐవీ నియంత్రణలో వికారాబాద్ రికార్డు!

VKB: హెచ్ఐవీ నియంత్రణలో అంతర్జాతీయ 95-95-95 లక్ష్యాలను సాధించి వికారాబాద్ జిల్లా కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి 'సురక్షిత్' హోదా పొందింది. డిసెంబర్ 1న ఢిల్లీలోని అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జరిగే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంలో సత్కారం అందుకోవాలని జాయింట్ సెక్రటరీ రీతు శర్మ కలెక్టర్ దీపక్ తివారీకి ఆహ్వానం పంపారు. ఈ కార్యక్రమానికి వైద్యాధికారుల బృందం హాజరుకానుంది.