హైదరాబాద్: 28°C
తెలంగాణ

లీగల్ మెట్రాలజీ శాఖలో సిబ్బంది కొరత

WNP: జిల్లాలో లీగల్ మెట్రాలజీ శాఖకు పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో తనిఖీలు, పర్యవేక్షణ మందగించాయి. గద్వాల జిల్లా అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించడంతో కార్యాలయం తరచూ తాళం వేసి ఉంటోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూకాలు, కొలతల్లో తనిఖీలు లేకపోవడం వినియోగదారుల ప్రయోజనాలపై ప్రభావం చూపుతోంది అన్నారు. పూర్తి స్థాయి అధికారిని నియమిచాలని స్థానికులు కోరుతున్నారు.