హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్థరాత్రి వంటగదిలో కొండచిలువ కలకలం

KNR: హుజూరాబాద్ మండలం సిరిసపల్లి గ్రామంలో అర్ధరాత్రి కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉండగా, వంటగది నుంచి వింత శబ్దాలు వినిపించాయి. తొలుత పిల్లి వచ్చిందని భావించినా, శబ్దాలు పదేపదే రావడంతో నిద్రలేచి చూడగా కిటికీ దగ్గర భారీ కొండచిలువ కనిపించింది. ఒక్కసారిగా కొండచిలువను చూసిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఇంట్లోకి భారీ కొండచిలువ చొరబడటంతో ఆ కుటుంబం తీవ్ర భయానికి గురైంది.