హైదరాబాద్: 28°C
తెలంగాణ

బంగారం ధరల పతనం.. గోల్డ్ లోన్లపై ప్రభావం

NZB: బంగారం ధరలు భారీగా తగ్గడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న రైతులు, మహిళలు, చిన్న వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. బంగారం విలువ తగ్గడంతో రుణాలకు అదనపు నగదు చెల్లించాలని లేదా మరింత బంగారం తాకట్టు పెట్టాలని ఆర్థిక సంస్థలు కోరే అవకాశం ఉంది. రుణాల చెల్లింపుల్లో జాప్యంతో బంగారం వేలాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.