హైదరాబాద్: 28°C
తెలంగాణ

బండరాయపాకుల గ్రామంలో పేలిన గ్యాస్ సిలిండర్!

WNP: వనపర్తి మండలం బండరాయపాకుల గ్రామంలో సిలిండర్ పేలుడు కలకలం రేపింది. గ్రామానికి చెందిన పుల్లాసి శ్రీలత గుడిసెలో సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగి గుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్రమైన ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీలను ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.