హైదరాబాద్: 28°C
తెలంగాణ

సచివాలయ ఉద్యోగినంటూ రూ.20 లక్షల దగా

MDK: మెదక్ పట్టణానికి చెందిన అలకంటి యశ్వంత్ తాను సచివాలయంలో పనిచేస్తున్నానని నమ్మించి ఇద్దరిని మోసగించాడు. ప్రభుత్వ బిల్లులు మంజూరు చేయిస్తానని ఓ ఆర్అండ్‌బీ కాంట్రాక్టర్ నుంచి రూ.10 లక్షలు, విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నర్సాపూర్‌కు చెందిన మరో వ్యక్తి నుంచి రూ.10.70 లక్షలు తీసుకున్నాడు. నకిలీ నియామక పత్రం ఇచ్చాడని బాధితులు ఫిర్యాదు చేయగా, సీఐ మహేశ్ కేసు నమోదు చేశారు.