హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాలిగౌరారం ఇన్‌చార్జి ఎంపీడీవోగా రమేశ్

NLG: శాలిగౌరారం ఇన్‌చార్జీ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా భువనగిరి రమేశ్ ఈరోజు బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో పనిచేసిన విజయకుమార్ అక్టోబర్ 31న పదవీ విరమణ చేయడంతో ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం కట్టంగూర్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రమేశ్‌ను ఇన్‌చార్జి ఎంపీడీవోగా నియమించారు. మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.