హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెక్కుచెదరని స్నేహబంధం

WGL: నెక్కొండ జెడ్పీఎస్ఎస్ పాఠశాల 1993-94 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు స్నేహబంధాన్ని వినూత్నంగా కొనసాగిస్తున్నారు. ఏటా ఓ పర్యాటక ప్రాంతానికి కుటుంబాలతో కలిసి పర్యటనకు వెళ్తూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఈ ఏడాది కేరళ పర్యటనకు కుటుంబ సమేతంగా వెళ్లి ఆనందంగా గడిపారు. వీరి తీరును పలువురు అభినందిస్తున్నారు.