హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతుల పాలిట శాపంగా కూనారం 1638 సన్నరకం వరి

KMR: రామారెడ్డి, కామారెడ్డి మండలాల పరిధిలో కూనారం 1638 సన్నరకం వరి రైతుల పాలిట శాపంగా మారింది. పంట కోత దశలో వచ్చిన వాతావరణ మార్పులు, తెగుళ్ల కారణంగా ధాన్యం గింజలు కొంత మేరకు నలుపు రంగులోకి మారాయి. ధాన్యం నాణ్యతగా లేదనే సాకుతో ప్రైవేటు వ్యాపారులు ముఖం చాటేస్తుండగా.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనూ తిరస్కరిస్తుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.