BHNG: రాజపేట మండల కేంద్రంలో మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. భవన నిర్మాణాల కోసం అక్రమార్కులు ప్రభుత్వ అసైన్డ్, రైతుల పట్టా భూముల్లో అడ్డగోలుగా మొరం తోడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. రఘునాథపురం, పుట్టగూడెం శివారుల్లో గుట్టలను తొలుస్తూ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు స్పందించి మట్టి అక్రమ రవాణా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
రాజపేటలో యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా


