హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా రాములవారి నిత్య కళ్యాణం

BDK: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో శనివారం స్వామి వారి నిత్య కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ఉదయం ఆలయ తలుపులు తెరిచి సుప్రభాత సేవ, ఆరాధన శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సీతారామలక్ష్మణులను మిధిలా స్టేడియంలో కొలువుతీర్చి వేదమంత్రాల నడుమ అర్చకులు కళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.