JN: స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లులో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లోకనాథం (84) శుక్రవారం రాత్రి మృతి చెందారు. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య రామక్క (75) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గంటల వ్యవధిలోనే దంపతులు ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ
గంటల వ్యవధిలో భార్యాభర్తల మృతి


