హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ విప్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీహరి రావు

NRML: ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డిని కొండాపూర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హందన్‌ను కూడా సత్కరించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.