హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి నుంచి దూరవిద్య పీజీ తరగతులు

KMM: ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో పీజీ అభ్యర్థులకు ఆదివారం నుంచి తరగతులు మొదలుకానున్నాయి. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్ అభ్యర్థులు తరగతులకు హాజరుకావాలని కావాలని ప్రిన్సిపాల్ డాక్టర్ జాకీరుల్లా, కోఆర్డినేటర్ డాక్టర్ వీరన్న సూచించారు.