SRD: పటాన్చెరువు బీరంగూడ గుట్టపై నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఇవాళ తన నివాసంలో ఆలయ కమిటీ సభ్యులకు విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక చింతన, సామాజిక ఐక్యత పెంపొందించడంలో దేవాలయాల నిర్మాణం కీలకమన్నారు.
తెలంగాణ
అయ్యప్ప ఆలయానికి రూ.10 లక్షల విరాళం: MLA


