MHBD: కేసముద్రం మండలంలోని చెరువుముంతు తండా, బోడమాచ తండాల్లో శనివారం పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 4 వేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 50 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 50 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. గంజాయి, సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
తెలంగాణ
గుడుంబా తయారీపై పోలీసుల దాడులు..!


