HYD: ఉప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పల్ భగాయత్ HMDA లేఅవుట్ నుంచి నాగోల్ వైపు వెళ్తున్న యమహా FZ బైక్ డివైడర్ పై ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న మహమ్మద్ మునాజిర్ (34), వెనుక కూర్చున్న మహమ్మద్ సలావుద్దీన్ (35) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి


