BHNG: మోత్కూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఉదయం పాము కలకలం రేపింది.విధులకు హాజరైన వైద్య సిబ్బంది ల్యాబ్ గదిలో పామును గుర్తించి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పామును బయటకు పంపించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో పాముల సంచారంపై సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ
మోత్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలం


