హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కేఎన్నార్ మార్నింగ్ వాక్' కార్యక్రమం ప్రారంభం

KNR: కరీంనగర్ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సుడా మాజీ ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి 'కేఎన్నార్ మార్నింగ్ వాక్' ప్రారంభించారు. శనివారం ఉదయం అంబేడ్కర్ స్టేడియంలో వాకర్లతో మాట్లాడారు. గతంలో సుడా కేటాయించిన రూ.95 లక్షలతో సింథటిక్ ట్రాక్ పనులు మొదలవుతాయని, రెండు రోజుల్లో మరుగుదొడ్లకు మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు.