హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీరాపూర్‌లో ఇంటింటికీ ఉచిత వైద్య పరీక్షలు

JGL: రాయికల్‌ మండలం వీరాపూర్ రోడ్డులో లయన్స్ క్లబ్ ఆఫ్ రాయికల్ ఆధ్వర్యంలో శనివారం ఇంటింటికీ ఉచిత షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 30 మందికి పరీక్షించగా నలుగురికి షుగర్ ఉన్నట్లు తేలింది. ఆరోగ్యకర ఆహారం తీసుకుంటూ, ప్రతిరోజూ వాకింగ్ చేయాలని ల్యాబ్ టెక్నీషియన్ మోసారపు సంతోష్ సూచించారు. క్లబ్ అధ్యక్షుడు వాసం ప్రసాద్, సత్యనారాయణ, అశోక్ పాల్గొన్నారు.