హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై ఎమ్మార్వో హెచ్చరిక

MDCL: తాహసీల్దార్ ఆదేశాల మేరకు గాజులరామారం గ్రామం సర్వే నెం.342లోని రాజన్న బస్తీలో ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఆర్ఎ కలీం, గ్రామ పాలన అధికారి డి. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసుల సహకారంతో 3 ఇళ్లు, 2 గుడిసెలను తొలగించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో హెచ్చరించారు.