హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నేరాల నియంత్రణకే కార్డాన్ సెర్చ్: ఏసీపీ

​RR: శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ కోసమే కార్డాన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నట్లు చేవెళ్ల ఏసీపీ కిషన్ గౌడ్ తెలిపారు. శనివారం శంకర్ నగర్ మున్సిపల్ పరిధిలో సీఐ రుద్వీర్ కుమార్, ఎస్సైలతో కలిసి ఆయన తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 50 వాహనాలను సీజ్ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.