హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు MSF జిల్లా నూతన కమిటీ ఎన్నిక

BHPL: జిల్లా కేంద్రంలో ఈ నెల 22న ఆదివారం ఉదయం 11 గంటలకు MSF జిల్లా నూతన కమిటీ ఎన్నిక సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా ఇంఛార్జ్ సుమన్ మాదిగ తెలిపారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జరిగే ఈ సమావేశానికి MRPS తెలంగాణ మాజీ అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అన్ని మండలాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు.