హైదరాబాద్: 28°C
తెలంగాణ

మౌలిక సౌకర్యాలు కల్పించాలని పర్యాటకుల వినతి

MNCL: జన్నారం మండల కేంద్ర శివారులోని జింకల పార్కు వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. జన్నారం అటవీశాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జింకల కోసం పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడకు వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు నిత్యం వచ్చి జింకలను చూస్తుంటారు. జింకల పార్కు వద్ద తాగునీరు, షెడ్ లాంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.