హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైద్య శిబిరానికి విశేష స్పందన

AKP: మాడుగుల మండలం ఎం. కోడూరు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత హోమియో వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ శిబిరంలో మొత్తం 130 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ మౌనిక తెలిపారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.