హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండో వార్డులో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని వినతి

KNR: కొత్తగట్టు గ్రామంలోని రెండో వార్డులో నాలుగు ఇళ్లకు డ్రైనేజీ నీరు వెళ్లే మార్గం లేక మురుగునీరు నిలిచిపోతోంది. గత ఎనిమిది నెలలుగా విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు తెలిపారు. దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని, సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ పైపు లేదా మోరి ఏర్పాటు చేయాలని కోరారు.