హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోలింగ్ రోజుల్లో స్థానిక సెలవులు'

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలింగ్ నిర్వహించే ప్రాంతాల్లో ఈ నెల 26, 29 తేదీలతో పాటు డిసెంబర్ 2న సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. ఆయా రోజుల్లో పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు మాత్రమే సెలవు వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.