హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా స్థాయి కళా, సాంస్కృతిక పోటీలు

జగిత్యాల జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆర్ట్స్ అండ్ కల్చర్ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని 20 పీఎం శ్రీ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ కళా ప్రతిభను ప్రదర్శించారు. వివిధ కళారూపాల్లో ప్రతిభ చాటుతూ పోటీల్లో ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమలోని సృజనాత్మకతను, కళానైపుణ్యాలను ప్రదర్శించారు.