SKLM: ధాన్యం, బియ్యం వ్యాపారులు తమ నిల్వల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా విజిలెన్స్ ఎస్పీ వివేకానంద శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం.. రైస్ మిల్లర్లు, ప్రాసెసర్లు, హోల్ సేలర్లు, ట్రేడర్లు, రిటైలర్లు, బిగ్ చైన్ రిటైలర్లు తమ వివరాలను జిల్లా పౌర సరఫరాల అధికారి వద్ద నమోదు చేసుకోవాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'బియ్యం వివరాల నమోదు తప్పనిసరి'


