హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదం.. దంపతులకు గాయాలు

KMR: బిక్కనూర్ మండలంలోని లక్ష్మీనగర్ తండా సమీప జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. టీవీఎస్ ఎక్సెల్‌పై కామారెడ్డి వైపు వెళ్తున్న దంపతులను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.