హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముదిగుబ్బ ఎంపీపీ ఎన్నిక రెండోసారి వాయిదా

సత్యసాయి: ముదిగుబ్బ ఎంపీపీ ఎన్నిక సభ్యుల గైర్హాజరు కారణంగా రెండోసారి వాయిదా పడింది. 17 స్థానాల్లో టీడీపీ-8, బీజేపీ-3, వైసీపీ-6 గెలుచుకున్నాయి. కూటమికి మెజార్టీ ఉన్నా, ఎస్టీ రిజర్వ్‌డ్ పీఠం కోసం సోముసుందర్ నాయక్, హేమలతాబాయి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఎన్నికల సంఘం కొత్త తేదీని ఖరారు చేస్తుందని ఆర్వో సూర్యశేఖర్ తెలిపారు.