హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏటీఎం కార్డు మార్చి రూ.30 వేల మోసం

కర్నూలు కొత్త బస్టాండు ఈద్గా సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద ఈనెల 18న జరిగిన మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డబ్బులు డ్రా చేసి ఇస్తామంటూ ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళ ఏటీఎం కార్డును మార్చి, ఆమె పిన్ నంబర్‌తో ఖాతా నుంచి మూడుసార్లు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.30 వేలు కాజేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.