హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అదుపుతప్పి బోల్తా పడిన లారీ

KKD: పిఠాపురం పట్టణం పాదగయ జంక్షన్ దాటాక బైపాస్ రోడ్డులో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఒక్కసారిగా శబ్దం రావడంతో స్థానికులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిద్ర మత్తు ప్రమాదానికి కారణమా? అనేది తెలియాల్సి ఉంది.