హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

BPT: బాపట్ల నుంచి తిరుపతికి వెళ్తున్న సమయంలో ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం పెళ్లూరు గ్రామంలోని రైస్ కళాశాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.