హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు రాజమండ్రిలో పవర్ కట్

E.G: అత్యవసర మరమ్మతుల నిమిత్తం శనివారం రాజమండ్రి లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ నక్కపల్లి శామ్యూల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సీతంపేట, లింగంపేట, అడితిల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఆయా ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని కోరారు.