E.G: రాజమండ్రి ధోబీఘాట్ వద్ద శుక్రవారం గోదావరి నదిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. విశాఖపట్నం కంచరపాలెంకు చెందిన బొంతాల జ్ఞానేశ్వరరావు (46) రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై నుంచి నదిలో దూకి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
ఆంధ్రప్రదేశ్
గోదావరిలోకి దూకి వ్యక్తి మృతి.. మృతదేహం లభ్యం


