భద్రాద్రి జిల్లా, లక్ష్మీదేవిపల్లి (M) పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన కేసులో భార్యాభర్తలను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 16న ఇల్లందు క్రాస్‌రోడ్డు వద్ద కానిస్టేబుల్ దుర్గం విజయ్‌కుమార్‌పై పైపులు, కర్రలతో దాడి చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితులను రిమాండ్‌పై భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు.
తెలంగాణ
ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి.. భార్యాభర్తల అరెస్ట్


