హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పదో తరగతి పరీక్ష ఫీజుల పేరుతో అధిక వసూళ్లు'

ప్రకాశం: జిల్లాలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు పదో తరగతి పరీక్ష ఫీజుల అధికంగా వసూలు చేస్తున్నాయి. నిర్ణిత రూ.125కు బదులుగా రూ.800 నుంచి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఓఎంఆర్ షీట్ పేరుతో అదనపు నగదు తీసుకుంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఫిర్యాదులు అందితే చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఈవో శ్రీనివాసులు తెలిపారు.