ప్రకాశం: జరుగుమల్లి మండలం పాలేటిపాడులో సర్పంచి పదవికి ఏకగ్రీవ ఎన్నిక జరిగితే గ్రామాభివృద్ధికి రూ.30 లక్షలు అందించడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి 5 లేదా 6 సెంట్ల స్థలాన్ని ఉచితంగా ఇస్తామని సుదీప్తి దంపతులు ముందుకొచ్చారు. గ్రామస్థులు ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. దీంతో మరో అభ్యర్థి స్వప్న నామినేషన్ ఉపసంహరించుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
'ఏకగ్రీవ ఎన్నికైతే గ్రామాభివృద్ధికి రూ.30 లక్షలు'


