హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడో విడత పంచాయతీ నామినేషన్లు షురూ..

బాపట్ల జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ శనివారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. బాపట్ల, రేపల్లె సహా ఏడు మండలాల్లోని 143 పంచాయతీలకు 57 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డా. వినోద్ కుమార్ తెలిపారు. రెండో విడతలో 113 పంచాయతీలకు 642 సర్పంచి నామినేషన్లు దాఖలయ్యాయని వెల్లడించారు. మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరి తేదీ అన్నారు.