హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రత'

SKLM: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు SP మహేశ్వర రెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మూడో విడత ఎన్నికలకు సంబంధించి ఈనెల 21 - 23వ తేదీ వరకు 3 రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.