హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ ప్రాంతాల్లో నేడు పవర్ కట్

GNTR: నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు, చెట్ల కొమ్మల తొలగింపు పనుల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్తంభాలగరువు ప్రాంతంలో, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పట్టాభిపురం, డీఆర్‌ఎం ఆఫీస్ రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.