హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

16 ఏళ్ల బాలిక అనుమానస్పద మృతి

GNTR: ననల్లపాడు ఎస్సీ కాలనీకి చెందిన సౌమ్య (16) అనే డిప్లొమా మొదటి సంవత్సరం విద్యార్థిని చెరువులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. శుక్రవారం కళాశాలకు వెళ్లిన ఆమె సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. చెరువు సమీపంలో ఆమె బ్యాగు కనిపించడంతో పరిశీలించగా మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.