హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి పెందుర్తిలో నామినేషన్లు

AKP: పెందుర్తిలోని 15 గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. MPDO కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులకు అవసరమైన సామగ్రిని MPDO అప్పలరాజు అందజేశారు. ఆరు గ్రామాల కార్యాలయాల్లో ఈనెల 23వ తేదీ వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు.