గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎల్ఆర్ఎస్ మేళాకు శుక్రవారం విశేష స్పందన లభించింది. మొత్తం 155 మంది దరఖాస్తుదారులు హాజరై తమ పెండింగ్ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకున్నారు. శనివారం జీఎంసీ ప్రధాన కార్యాలయం, బృందావన్ గార్డెన్స్ సర్కిల్ కార్యాలయంలో మేళా కొనసాగుతుందని సిటీ ప్లానర్ డి. రాంబాబు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు LRS మేళా: రాంబాబు


