హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి సేవలకు 32.25 లక్షల మంది పోటీ

TPT: తిరుమల శ్రీవారి ఫిబ్రవరి నెల ఆర్జిత సేవల ఈ-డిప్ నమోదు పూర్తయింది. తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, సుప్రభాత సేవలకు కలిపి మొత్తం 32,25,228 మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. అందుబాటులో ఉన్న 7,744 టికెట్లకు ఈ-డిప్ నిర్వహించనున్నారు. ఇందులో సుప్రభాత సేవకు అత్యధికంగా 8.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.