హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రిలో మంత్రి దుర్గేష్ ఇంటింటా ప్రచారం

E.G: గ్రేటర్ రాజమండ్రి సమగ్రాభివృద్ధికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కోరారు. శుక్రవారం రాత్రి రాజమండ్రి నగరంలోని 16వ వార్డు వెంకటగిరి కొండ ప్రాంతంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.