శ్రీకాకుళం నగర కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని 25, 26వ డివిజన్లలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మేయర్ అభ్యర్థి లక్ష్మీదేవి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ధర్మాన మాట్లాడుతూ.. రెండున్నరేళ్ల కూటమి పాలనలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయన్నారు. రూ.మూడు లక్షల కోట్లు అప్పు తెచ్చినా శ్రీకాకుళంకు వంద కోట్లెనా ఖర్చు చేయలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమికి ఓటుతో సమాధానం చెప్పండి: ధర్మాన


