హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుష్కరాల ఘాట్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

E.G: గోదావరి మహా పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం అధికారులతో సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్ల నిర్మాణం, అభివృద్ధి పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కొవ్వూరులోని పుష్కరాల రేవు ప్రాంతాన్ని పరిశీలించి, పనుల పురోగతిని తనిఖీ చేశారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు.