హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యూట్యూబర్‌పై కేసు నమోదు.. కారణమిదే!

ELR: ఉచితంగా మొబైల్ ఫోన్ ఇవ్వలేదనే కక్షతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు రాజస్థాన్ వ్యాపారులపై సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. వ్యాపారాలకు నష్టం కలిగేలా రెచ్చగొట్టే ప్రచారం చేశాడని రాజస్థాన్‌కు చెందిన వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఏలూరు టూ టౌన్ CI అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.